Adugaduguna GUDI vundhi

£3.99

It is a book of the compilation of unique temples and their significance from different parts of BHARATH, which are not known to the majority of Indians. A must-read and must-have book in your collection. Excellent option as a gift for book readers. A book by Sri.Raka Sudhakar Ji senior journalist of Rakalokam YouTube channel fame.

To subscribe to his channel, please click the below link:

https://www.youtube.com/channel/UC2QycHcuuYRrk2FGTUBQ89Q

46 in stock

Category:

గుడి అంటే ఏమిటి? మంటపం, ముఖద్వారం, గర్భగృహం, దేవుడు, ధ్వజస్తంభం …. గుడి అంటే ఇదేనా?

తీర్థం ప్రసాదం, అక్షింతలు, శఠగోపం… గుడి అంటే ఇదేనా…?

గుడి ఒక భావన… గుడి ఒక నిరంతరత… గుడి ఒక సజీవ సాక్ష్యం…

గుడి ఒక చరిత్ర… గుడి మన భవిష్యత్తు….

అలాంటి ఒక గుప్పెడు గుడుల కథే అడుగడుగున గుడి ఉంది…

బండరాళ్లే పైకప్పులుగా, గండశిలలే గోడలుగా ఉన్న హరిశ్చంద్రగఢ్ గుడి ఏం చెబుతోంది?

కాలం పరీక్షలకు తట్టుకుని, శతాబ్దాల దాడులను సహించి మరీ నిలిచిన మతౌలీ గుడి కథేమిటి?

అఫ్గన్ల దాడినుంచి సాక్షాత్ శివుడే వచ్చి రక్షించిన కల్నల్ మార్టిన్ పూజించిన గుడి ఇప్పుడేమంటోంది?

ఆవంచ గ్రామంలో తైలాపుడి తప్పిదంగా మిగిలిన గుండు గణేశుడు ఏం చెబుతున్నాడు? మతోన్మాదన్నల యుగంలో మాదన్న కట్టిన ఆ అజ్ఞాత గుడి కథేమిటి?

తనువంతా రామనామాన్ని పచ్చబొట్లుగా పొడిపించుకుని నడిచే రామకోటి పుస్తకాలుగా మారిన ఆ గిరిజనుల సందేశం ఏమిటి?

రామభక్తులకోసం సాక్షాత్ రాముడినే వంటవాడుగా మార్చిన ఆ గోచిపాతరాయుడెవరు?

చిలక జోస్యం అందరికీ తెలుసు… మరి ఎలక జోస్యం చెప్పే గుడి కథ మీకు తెలుసా?

గుడి, పూజారి తప్ప మరేమీ లేని సాగరతీర గ్రామం కథేమిటి?

చనిపోయిన సైనికుడికి గుడి కట్టిన తోటి జవాన్ల నమ్మకం ఏమిటి?

ఇలాంటి విలక్షణ గాథల సమాహారమే అడుగడుగున గుడి ఉంది. భగవంతుడికి, భక్తుడికి, భక్తికి, వీటన్నిటినీ మించి నమ్మకానికి అంకితమైన పుస్తకం అడుగడుగున గుడి ఉంది.

కట్టిపడేసే చిత్రాలు, కథనంలో విచిత్రాలు …. అదే అడుగడుగున గుడి ఉంది…..

చదవండి…. చదివితే చదివించేస్తారు…. కొనండి… కొంటే కొనిపించేస్తారు..

Reviews

There are no reviews yet.

Be the first to review “Adugaduguna GUDI vundhi”

Your email address will not be published.